- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మురళీధర్ రావు అక్రమాస్తుల కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి
నీటిపారుదల రిటైర్డ్ మాజీ ఈఎన్సీ చీటి మురళీధర్ రావు (Muralidhar Rao) ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ (ACB) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నీటిపారుదల రిటైర్డ్ మాజీ ఈఎన్సీ చీటి మురళీధర్ రావు (Muralidhar Rao) ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ (ACB) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను వారు గుర్తించారు. ఐదు రోజుల ఏసీబీ కస్టడీలో భాగంగా మురళీధర్‌రావును విచారించే క్రమంలో అధికారులు ఇవాళ నాలుగో రోజు బ్యాంక్ లాకర్లను తనిఖీ చేశారు. మురళీధర్ రావు 1976లో సర్వీసులో చేరగా.. శాలరీలు, అలవెన్స్‌లు కలిపి మొత్తం రూ.6.5 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కానీ, ఆయన వద్ద లభించిన డాక్యుమెంట్ల ప్రకారం రూ.9.2 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా ఆధారాలు లభించాయి. దీంతో ఆయన కుమారుడు సాయి అభిషేక్ (Sai Abhishek) పేరు మీద ఆస్తులను రిజిస్టర్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తమిళనాడు (Tamilnadu)లో ఆస్తులు కూడాబెట్టినట్లుగా గుర్తించారు. అదేవిధంగా పలు కంపెనీల్లో కుమారుడు సాయి అభిషేక్ పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు బృందం వెల్లడించింది. మొత్తం 6 బ్యాంకు లాకర్లలో ఇప్పటి వరకు 3 లాకర్లను ఓపెన్ చేసిన అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తులపై తండ్రీకొడుకుల ప్రశ్నించగా.. కస్టడీలో ఉన్న మురళీధర్ రావు ఏబీసీకి సహకరించడం లేదని తెలుస్తోంది.






