- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: ముంబై కిడ్నాప్ కేసు(Mumbai Kidnapping Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కిడ్నాపర్ రోహిత్ ఆర్యను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. వివరాల్లోకి వెళితే.. తన డిమాండ్లు పరిష్కరించాలని ముంబైలోని ఆర్‌ఏ స్టూడియో(RA Studio)కు చెందిన రోహిత్ ఆర్య(Rohit Arya) అనే వ్యక్తి 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేశారు. పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రుల నుంచి వరుస కంప్లైంట్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే కేసును ఛేదించారు. పిల్లలను రక్షించారు. అనంతరం కిడ్నాపర్ రోహిత్ ఆర్యను ఎన్‌కౌంటర్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో ఈ సంఘటన జరిగింది. రోహిత్ ఆర్యకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉన్నది. గత నాలుగు రోజులుగా ఆడిషన్లు నిర్వహిస్తున్నానంటూ పిల్లలను స్టూడియోకు రప్పించుకున్నాడని పోలీసులు గుర్తించారు. సుమారు వంద మంది పిల్లలు ఆడిషన్ల కోసం రాగా, 80 మంది పిల్లలను అతడు బయటకు పంపించాడు. సుమారు 20 మంది పిల్లలను స్టూడియో లోపల ఉంచి నిర్బంధించాడని తెలిపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగి ఎన్‌కౌంటర్ చేశామని పేర్కొన్నారు.






