ముంబై పేలుళ్ల నిందితుడు టైగర్ మెమన్‌కు షాక్.. ఆస్తుల వేలానికి సన్నాహాలు

by Kema Shiva Kumar |

1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ (Mumbai Serial Bomb Blasts) కేసు నిందితుడు టైగర్ మేమన్‌ (Tiger Memon)కు మహారాష్ట్ర సర్కార్ షాకిచ్చింది.

ముంబై పేలుళ్ల నిందితుడు టైగర్ మెమన్‌కు షాక్.. ఆస్తుల వేలానికి సన్నాహాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్స్ (Mumbai Serial Bomb Blasts) కేసు నిందితుడు టైగర్ మేమన్‌ (Tiger Memon)కు మహారాష్ట్ర సర్కార్ షాకిచ్చింది. ఈ మేరకు అతడితో పాటు కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తుల వేళానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. అయితే, నాడు బాంబు బ్లాస్ట్స్‌ ప్లాన్ చేసేందుకు మీటింగ్ నిర్వహించిన ఫ్లాట్‌ కూడా ఆ ఆస్తుల్లో ఉండటం విశేషం. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్ఛ్సేంజ్ మానిప్యులేటర్స్ (Forfeiture of property) యాక్ట్ అథారిటీ (SAFEMA)కి ప్రత్యేక టాడా కోర్టు నుంచి టైగర్ మేమన్, అతడి కుటుంబ సభ్యులకు చెందిన 17 ఆస్తుల వివరాలు తమకు అందాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటి అందులో ఎనిమిది ఆస్తులను SAFEMA స్వాధీనం చేసుకోగా.. సెంట్రల్ ముంబైలోని మహిమ్‌లో ఉన్న అల్ హుస్సేనీ అపార్ట్‌మెంట్‌లో మూడు ఫ్లాట్లు కూడా అందులో ఉన్నాయి. ఆ భవనంలోనే టైగర్ మేమన్, అతడి ఐదుగురు సోదరులు, వారి తల్లి ఒకప్పుడు నివసించారని గురువారం ఒక సీనియర్ అధికారి తెలిపారు.

కాగా, టైగర్ మేమన్ ముంబై వరుస పేలుళ్ల తరువాత కరాచీ (Karachi)లోని డిఫెన్స్ అథారిటీ హౌసింగ్ కాలనీ అనే హై-ప్రొఫైల్, బలమైన భద్రత ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అతడిని ఇంటర్‌‌పోల్‌ (Interpol)తో పాటు సీబీఐ (CBI) కూడా గాలిస్తూనే ఉంది. అతడి సోదరుడు యాకూబ్ మేమన్ (Yakub Memon) బాంబ్ పేలుళ్ల కేసులో అరెస్ట్ అయి 2015లో ఉరి తీయబడ్డాడు. మరో సోదరుడు యూసుఫ్ మేమన్ (Yusuf Memon) 2020లో జైలులోనే మరణించాడు.

Next Story