Telangana: ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి

by velandi.Saikiran |   (  Updated:2025-04-17 14:30:36  IST  )

తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ ( Betting ) బారిన పడి చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర

Telangana: ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ ( Betting ) బారిన పడి చాలామంది యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్ లను... కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ... నియంత్రణ మాత్రం జరగడం లేదు. ఏదో ఒక మూలన... బెట్టింగ్ యాప్ బారినపడి... యువకులు సూసైడ్ చేసుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, బీటెక్ అలాగే ఎంటెక్ విద్యార్థులు కూడా బెట్టింగ్ యాప్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది.

ఆన్ లైన్ బెట్టింగుకు మరో యువకుడు బలి అయ్యాడు. బెట్టింగ్ యాప్ లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు పవన్ ( Pawan) అనే ఎంటెక్ విద్యార్థి. హైదరాబాద్ లోనే ఉంటూ ఎంటెక్ చేస్తున్నాడు పవన్. అయితే... తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే నేపథ్యంలో.. ఆన్లైన్ బెట్టింగుకు అలవాటు అయ్యాడు. మొదట్లో డబ్బులు రాగానే... లైఫ్ ఎంజాయ్ చేశాడు. కానీ తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ లో వేగంగా లక్ష రూపాయలు పెట్టి పోగొట్టుకున్నాడు పవన్.

ఆ డబ్బులు పోగొట్టుకున్న బాధలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పవన్. మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూ లో ఎంటెక్ చదువుతున్నాడు పవన్. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తు చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్ లో పోగొట్టుకున్న లక్ష రూపాయలు.. అప్పుగా తెచ్చాడా ? లేక ఇంట్లో వాళ్ళు ఇచ్చారా ?అనే కోణం లో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ఆన్ లైన్ బెట్టింగుకు బలైన పవన్ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story