- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mounika Murder: మౌనిక హత్య కేసు.. దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి
మౌనిక హత్య కేసులో పోలీసుల విచారణలో భాగంగా షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాజువాక మౌనిక (Mounika) హత్య కేసులో పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రవీంద్ర (Ravindra) ఎంత క్రూరంగా ప్లాన్ చేసి మౌనికను అంతమొందించాడో స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సందర్భంగా పోలీసులు షాకింగ్ వివరాలను వెల్లడించారు.
నిందితుడి పక్కా స్కెచ్..
మార్చి 29న తన స్నేహితుడి ఇంటి తాళాలు తీసుకున్న రవీంద్ర, అది తన సొంత ఫ్లాట్ అని నమ్మించి మౌనికను అక్కడికి తీసుకెళ్లినట్లుగా నిందితుడు రవీంద్ర వెల్లిడించాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, మౌనిక కేకలు వేయకుండా రవీంద్ర ఆమె నోరు మూసివేసి, గొంతుపై మోకాలితో బలంగా నొక్కి ప్రాణాలు తీశానని ఒప్పుకున్నాడు. హత్య చేసిన అనంతరం రవీంద్ర అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన సొంత ఫ్లాట్‌కు వెళ్లి ఒక ట్రాలీ బ్యాగ్‌ను తీసుకొచ్చాడు. మౌనిక మృతదేహాన్ని ఆ బ్యాగ్‌లో కుక్కి, ఎవరికీ అనుమానం రాకుండా తన ఫ్లాట్‌కు తరలించాడు. రవీంద్ర మృతదేహాన్ని దాచిపెట్టేందుకు తన ఫ్లాట్‌లోనే భయానక చర్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఆ తర్వాత శరీర భాగాలను జీడితోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. అయితే, ఇక్కడ అసలు ట్వీస్ట్ ఏమింటంటే.. ఈ హత్య జరిగిన ఫ్లాట్ రవీంద్ర స్నేహితుడిదే అయినప్పటికీ, అక్కడ హత్య జరిగిన విషయం అతనికి తెలియదని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిందితుడు రవీంద్ర ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు.






