దారుణం.. 45 రోజుల పసికందు గొంతుకోసి చంపిన తల్లి

by Naga Rani Yarlagadda |

నవమాసాలు మోసి, కన్న బిడ్డకు పాలిస్తూ.. అమ్మతనాన్ని ఆస్వాదించాల్సిన తల్లే.. ఆ బిడ్డను గొంతుకోసి చంపింది.

దారుణం.. 45 రోజుల పసికందు గొంతుకోసి చంపిన తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: నవమాసాలు మోసి, కన్న బిడ్డకు పాలిస్తూ.. అమ్మతనాన్ని ఆస్వాదించాల్సిన తల్లే.. ఆ బిడ్డను గొంతుకోసి చంపింది. అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చిన ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో జరిగింది. 45 రోజుల పసికందు గొంతుకోసి చంపడం స్థానికంగా తీవ్రకలకలం రేపింది. ఆ తల్లి తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండటమే బిడ్డ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని అహిర్ ఖేడి ప్రాంతంలో సన్నీ సోలంకి - నేహా దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు 45 రోజుల కొడుకు ప్రియాంశ్ ఉన్నాడు. బిడ్డను కన్నప్పటి నుంచి డిప్రెషన్ లో ఉన్న నేహా.. ఇంట్లో సన్నీ లేని సమయంలో పదునైన ఆయుధంతో ప్రియాంశం గొంతుకోసి దారుణంగా హతమార్చింది. ఆపై తనకేమీ తెలియనట్లుగా బయట బట్టలు ఉతుకుతున్న ఆడపడుచుని పిలించింది. బాబుకు ఏదో అయిందంటూ లబోదిబోమంది. ఆమె లోపలికి వచ్చి చూసేసరికి బాబు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

వెంటనే ఆడపడుచు ఇతర కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా.. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. నేహా చేతులపై ఉన్న రక్తపు మరకల్ని చూసి ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో తానే బాబుని చంపినట్లు అంగీకరించింది. ఆమెను అరెస్ట్ చేసి, సెక్షన్ 103 కింద కేసు నమోదు చేశారు. నేహా మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, గతంలోనూ బాబుని చంపేందుకు ప్రయత్నించిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరోసారి వైద్యపరీక్షలు చేయించి ఆమె మానసిక పరిస్థితి తెలుసుకుంటామని పేర్కొన్నారు.

Next Story