- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాపారవేత్త సంజయ్ మృతిపై తల్లి సంచలన ఆరోపణలు
ఇటీవల పోలో ఆడుతూ ప్రముఖ వ్యాపారవేత్త, సోనా కామ్ స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మృతిపై తల్లి రాణీ కపూర్ అనుమానం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల పోలో ఆడుతూ ప్రముఖ వ్యాపారవేత్త, సోనా కామ్ స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన మృతిపై తల్లి రాణీ కపూర్ అనుమానం వ్యక్తం చేశారు. సోనా కామ్ స్టార్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ, సెబీకి రాసిన లేఖలో ఆరోపణలు చేశారు. ఇది కేవలం గుండెపోటు మాత్రమేనని కొట్టిపారేయడం ఎంతో బాధిస్తుందన్నారు. మీడియాలో వచ్చే వార్తలకు, జరిగిన ఘటనకు పొంతన లేదన్నారు. తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, కుమారుడిని కోల్పోయిన బాధలో తానుంటే కొన్ని పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు.
ఆ కాగితాలే దేనికి సంబంధించినవి అని అడిగినా సమాధానం లేదని, బ్యాంకు ఖాతాలు వాడలేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఒకరి దయతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కుటుంబ వారసత్వాన్ని లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సోనా బోర్డ్ గ్రూపులకి ఎవ్వరినీ చేర్పించుకోడానికి తాను అనుమతివ్వలేదని అన్నారు. ఇదిలా ఉంటే సంజయ్ కపూర్ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త. విడాకుల తరవాత ఆయన 2017లో ప్రియా సచ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. సోనా గ్రూప్ కంపెనీల విలువ ప్రస్తుతం దాదాపు రూ.40వేల కోట్లు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.






