ఏపీలో షాకింగ్ ఘటన.. అల్లుడితో అత్త ఎఫైర్.. కూతురు పెళ్లికి అడ్డొచ్చిందని దారుణం!

by Ajay Maddhiboyina |

సమాజంలో రోజురోజుకు విలువలు కనుమరుగవుతున్నాయి. వావి వరస లేకుండా సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. కూతురు పెళ్లి చేసుకున్నవాడితోనే ఆమె తల్లి అక్రమసంబంధం పెట్టుకుంది.

ఏపీలో షాకింగ్ ఘటన.. అల్లుడితో అత్త ఎఫైర్.. కూతురు పెళ్లికి అడ్డొచ్చిందని దారుణం!
X

దిశ,వెబ్ డెస్క్: సమాజంలో రోజురోజుకు విలువలు కనుమరుగవుతున్నాయి. వావి వరస లేకుండా సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి షాకింగ్ ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. కూతురు పెళ్లి చేసుకున్నవాడితోనే ఆమె తల్లి అక్రమసంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా అతడితో పెళ్లికి సైతం సిద్ధం అయ్యింది. ఈ ఘటన తిరుపతి జిల్లా కేవీబీపురంలో చోటు చేసుకుంది.

కేవీబీపురానికి చెందిన ఓ బాలిక ఐదు నెలల క్రితం ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా గత కొన్ని రోజులుగా ఆ బాలిక తల్లి అల్లుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. కూతురి ముందే అతడితో తాళి కట్టించుకునేందుకు సిద్దం అవ్వగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కూతురిపై తల్లి రోకలిబండతో దాడి చేసింది. బాలిక కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Next Story