- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శిశువును ముక్కలు ముక్కులగా నరికి.. పాప బాడీని ఏసీలో పెట్టిన కన్న తల్లి..
తను చనిపోయినా బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కన్న తల్లి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కన్నబిడ్డ సుఖానికే ఓటేస్తుంది. తను పస్తులుండి పిల్లల కడుపు నింపుతుంది. వాళ్లు ఎదుగుతూ ఉంటే చూసి సంతోషపడుతుంది. కానీ ఈ కర్కశ తల్లి ..

దిశ, వెబ్‌సైట్ : తను చనిపోయినా బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కన్న తల్లి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే కన్నబిడ్డ సుఖానికే ఓటేస్తుంది. తను పస్తులుండి పిల్లల కడుపు నింపుతుంది. వాళ్లు ఎదుగుతూ ఉంటే చూసి సంతోషపడుతుంది. కానీ ఈ కర్కశ తల్లి మాత్రం పుట్టిన బిడ్డను ముక్కలు ముక్కలుగా నరికింది. బాడీని ఏసీలో పెట్టి ఏమీ తెలియనట్లు నటించింది. దీంతో ఫ్యామిలీ మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. పోలీసుల విచారణలో హంతకురాలు తల్లే అని తేలింది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా పాప ఫొటో చూసిన నెటిజన్లు.. ఇంత క్యూట్ పాపను ఎలా చంపాలనిపించిందని తిట్టిపోస్తున్నారు. ఆ నవ్వు చూస్తేనే కడుపు నిండిపోతుంది.. అలాంటిది పాపను అలా ఎలా చేయాలనిపించిందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాపను దగ్గరుండి రక్షించాల్సిన తల్లే భక్షకురాలు కావడం నిజంగా శోచనీయమని.. సొసైటీ చాలా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కేసులు పెరుగుతున్న క్రమంలో మెంటల్ హెల్త్ అవేర్నెస్ గురించి డిస్కస్ చేస్తున్నారు.






