- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పండగ పూట దారుణం.. ఇద్దరి పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
తెలంగాణలో ఇటీవల కొన్ని దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఇటీవల కొన్ని దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవి కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సమస్యలు, సామాజిక ఒత్తిళ్ల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం హైదరాబాద్ బలానగర్‌లో 27 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే కృష్ణా జిల్లా చిలకలపాడు గ్రామంలో ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను విషం తాగించి హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
కొండమల్లేపల్లి (Kondamallepalli)కి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి, ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కొండమల్లేపల్లి లో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు నాగలక్ష్మి(27) అవంతిక(9) నాగసాయి (7)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బంధువులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.






