- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో తీవ్ర విషాదం.. అదనపు కట్నం కోసం కూతురిని చంపిన అత్తిల్లు.. బిడ్డ శవాన్ని చూసి చనిపోయిన తల్లి
బీహార్ భాగల్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అదనపు వరకట్నం కోసం అత్తింటి వారు కూతురిని చంపేయగా.. బిడ్డ శవాన్ని చూసి కుప్పకూలి మరణించింది తల్లి. వివరాల్లోకి వెళ్తే సునయనా దేవికి ఏడేళ్ల క్రితమే ఘనంగా కట్నకానుకలిచ్చి

దిశ, వెబ్ డెస్క్ : బీహార్ భాగల్పూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అదనపు వరకట్నం కోసం అత్తింటి వారు కూతురిని చంపేయగా.. బిడ్డ శవాన్ని చూసి కుప్పకూలి మరణించింది తల్లి. వివరాల్లోకి వెళ్తే సునయనా దేవికి ఏడేళ్ల క్రితమే ఘనంగా కట్నకానుకలిచ్చి వివాహం చేశారు తల్లిదండ్రులు. కొన్నాళ్లు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత అదనపు కట్నం కోసం టార్చర్ మొదలైంది. భర్త జాబ్ చేయకపోవడం, అత్తామామ మీద ఆధారపడటం వంటి విషయాలతో గొడవలు ఓ వైపు.. అదనపు కట్నం రగడ మరోవైపు.. దీంతో సునయన శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 11న కూడా గొడవ జరగ్గా.. భర్త, అత్తామామలు ఆమె గొంతు నులిమి చంపేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వరకట్న వేధింపులతో మరణం, హత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇక ఈ విషయం తెలిసి ఆస్పత్రికి చేరుకున్న తల్లి బబ్లీ దేవి.. బిడ్డ శవాన్ని పట్టుకుని అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించినా ఫలితం లేకుండా పోయింది. షాక్, స్ట్రెస్‌తో మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. ఇద్దరి మరణాలకు కారణమైన అత్తింటివారికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.






