- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతిని ట్రాప్ చేసిన తల్లీకొడుకు.. పోర్న్ వీడియోల్లో నటించాలని ఆరు నెలలుగా చిత్రహింసలు
దేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లీ, కొడుకు ఓ యువతిని ట్రాప్(Sex Racket) చేశారు. ఫ్లాట్‌లో బంధించి పోర్న్ వీడియోల్లో నటించాలని బలవంతం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తల్లీ, కొడుకు ఓ యువతిని ట్రాప్(Sex Racket) చేశారు. ఫ్లాట్‌లో బంధించి పోర్న్ వీడియోల్లో నటించాలని బలవంతం చేశారు. యువతి ఎంతకూ ఒప్పుకోకపోవడంతో దాదాపు ఆరు నెలలుగా చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్(West Bengal)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్వేతాఖాన్, ఆర్యన్‌ఖాన్ అనే తల్లీ, కుమారుడు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ నడిపిస్తున్నారు. ఇదే ముసుగులో పోర్న్ వీడియోలకు సంబంధించిన సినిమాల ప్రొడక్షన్ హౌస్‌నూ కూడా రహస్యంగా మెయింటైన్ చేశారు. ఈ క్రమంలోనే ఈవెంట్ మేనేజ్‌మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని హౌరాకు చెందిన యువతిని ట్రాప్ చేశారు. ఊహించిన దానికంటే ఎక్కువ జీతం ఇస్తామని ఆశజూపారు. దీంతో ఆశపడిన యువతి అంగీకరించింది. ఇంటికి వస్తే మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తామని యువతికి అడ్రస్ పెట్టారు. దీంతో సదరు యువతి ఆర్యన్ ఖాన్ ఇంటికి వెళ్లింది. అంగీకార పత్రాలు రాయించుకొని యువతిని బార్ డాన్సర్‌గా చేయాలని చెప్పారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో సెల్ ఫోన్ లాక్కొని దాడి చేశారు. ఓ ఫ్లాట్‌లో బంధించారు. చివరకు పోర్న్ వీడియోల్లోనూ నటించాలని ఒత్తిడి చేశారు. ఇలా ఒకటి కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా ఆరు నెలల పాటు హిత్రహింసలకు గురిచేశారు. చివరకు ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం తల్లీకొడుకుల కోసం గాలిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది.






