మా కారణంగా మీ జీవితం నాశనం కావొద్దంటూ భర్తకు లేఖ.. 13వ అంతస్తు నుంచి కొడుకుతో సహా దూకిన తల్లి

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-13 20:16:36  IST  )

ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఏస్ సిటీ సొసైటీలో హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. పదమూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు తల్లీకొడుకులు. వివరాల్లోకి వెళ్తే 37ఏళ్ల సాక్షి చావ్లాకు దర్పన్తో పదమూడేళ్ల క్రితం పెళ్లి

మా కారణంగా మీ జీవితం నాశనం కావొద్దంటూ భర్తకు లేఖ.. 13వ అంతస్తు నుంచి కొడుకుతో సహా దూకిన తల్లి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఏస్ సిటీ సొసైటీలో హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. పదమూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు తల్లీకొడుకులు. వివరాల్లోకి వెళ్తే 37ఏళ్ల సాక్షి చావ్లాకు దర్పన్తో పదమూడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరిద్దరికి 11ఏళ్ల కొడుకు దక్ష్ ఉన్నాడు. కానీ కొడుకు మెంటల్లీ చాలెంజ్డ్ కావడంతో చాలా రోజులుగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ సెట్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది తల్లి. ‘సారీ.. మేము ఈ ప్రపంచాన్ని వదిలివెళ్తున్నాం.. నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. మా కారణంగా నీ జీవితం నాశనం కావొద్దు. మా చావుకు ఎవరు బాధ్యులు కారు’ అంటూ ఆత్మహత్య లేఖ రాసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.

Next Story