- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో జంట హత్యల కలకలం.. తోటలో నిర్జీవంగా పడి ఉన్న తల్లీ, కూతుళ్లు
ఏపీలో జంట హత్యల కలకలం రేగింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు జీడిమామిడి తోటలో తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. తోటలో తల్లీ కూతుళ్లు నిర్జీవంగా పడి ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జంట హత్యల కలకలం రేగింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు జీడిమామిడి తోటలో తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. తోటలో తల్లీ కూతుళ్లు నిర్జీవంగా పడి ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆధార్ కార్డు ఇతర ఆధారాల ప్రకారం మృతులు తూర్పుగోదావరి జిల్లా అనంతపల్లికి చెందిన వెంకట లక్ష్మి, వరలక్ష్మిగా గుర్తించారు. అంధురాలైన వెంకటలక్ష్మి ఏలూరు నగరపాలన సంస్థలో స్వీపర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇద్దరి శరీరాలై బలమైన గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అంతే కాకుండా మృతదేహాలు వేరు వేరు ప్రదేశాల్లో పడి ఉన్నాయి. వారి బ్యాగులు సైతం అక్కడే పడి ఉండగా, అందులోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎవరో హత్య చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు గ్రామంలో హత్య జరగటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటువైపు వెళ్లాలంటే భయాందళన చెందుతున్నారు.






