HYD శివారులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

by Gantepaka Srikanth |

హైదరాబాద్ శివారు(HYD Suburb) ప్రాంతమైన మొయినాబాద్‌(Moinabad)లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌(Most Wanted Criminal)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

HYD శివారులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు(HYD Suburb) ప్రాంతమైన మొయినాబాద్‌(Moinabad)లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌(Most Wanted Criminal)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొయినాబాద్‌లో ల్యాండ్ కబ్జాకు యత్నించిన ఓ వ్యక్తిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రంగంలోకి దిగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ అని.. దీంతో సయ్యద్ సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌(Moinabad Police Station)కు తరలించి సయ్యద్‌పై రౌడీషీట్ ఓపెన్ చేశారు.

HYD శివారులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ఇటీవలే రాహుల్ గాంధీ(Rahul Gandhi) పీఏను అంటూ జార్ఖండ్ సీఎంవో(Jharkhand CMO)లో సయ్యద్ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ(CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులను మేనేజ్ చేస్తానంటూ ఓ వ్యాపారి నుంచి ఇటీవల రూ.కోట్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం అతని వద్ద నుంచి బెంజ్‌ కారు సహా ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి(AP Former Minister) సోదరుడి కొడుకును హనీట్రాప్‌లోకి దించి.. అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి రూ.25 లక్షలు వసూలు చేశాడు. సయ్యద్ మీద మొత్తం 15 కేసులు ఉండగా.. కేవలం హైదరాబాద్‌లోనే 11 కేసులు.. ఇతర రాష్ట్రాల్లో మరో 4 కేసులు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా అతని మీద మరో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story