- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు.. తీర్పును సోమవారానికి వాయిదా వేసిన కోర్టు
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు వ్యవహారంలో నిందితుల పోలీసు కస్టడీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు (Moinabad Farmhouse Case)లో నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ పూర్తయింది. ఉప్పర్‌పల్లి కోర్టు ఈ పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పైలట్ రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy), రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారించేందుకు వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఫామ్‌హౌస్‌లో జరిగిన వ్యవహారానికి సంబంధించి మరిన్ని కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని, నిందితుల నుంచి సమాచారం రాబట్టడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇవాళ ఉప్పర్‌పల్లి కోర్టు (Upparpally Court)లో ఉభయ పక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. నిందితుల తరపు లాయర్లు కస్టడీని వ్యతిరేకించగా, కేసు తీవ్రత దృష్ట్యా విచారణ అవసరమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తుది తీర్పును వచ్చే సోమవారానికి రిజర్వ్ చేసింది. ప్రస్తుతం నిందితులు రిమాండ్‌లో ఉండగా.. ప్రస్తుతం కోర్టు ఇచ్చే తీర్పు ఈ కేసులో తదుపరి విచారణకు అత్యంత కీలకం కానుంది.
అసైన్డ్ ల్యాండ్‌లో మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్.. అనుమతులపై ఆరా తీయగా బయటపడ్డ సంచలన నిజాలు!?






