- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం.. శంషాబాద్ పీఎస్‌కు నిందితుల తరలింపు
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్/శంషాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Farmhouse Drugs Case)లో పోలీసుల విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులను లోతుగా ప్రశ్నించేందుకు కోర్టు ఆదేశాలతో పోలీసులు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఉదయం వారిని చంచల్‌గూడ జైలు నుంచి భారీ భద్రత నడుమ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఎవరెవరు ఉన్నారు.. పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? అనే కోణంలో శంషాబాద్ రూరల్ పోలీసులు నిందితులను విచారించనున్నారు. అయితే, ఇప్పటికే నిందితుల నుంచి కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్స్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ కస్టడీ విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Next Story






