- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొయినాబాద్ బర్త్ డే పార్టీ కేసు.. దివ్వెల మాధురి బంధువుకు పోలీసుల నోటీసులు
మొయినాబాద్ పరిధిలోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పార్టీ నిర్వహిస్తున్న నలుగురిపై ఎస్‌వోటీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ పరిధిలోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పార్టీ నిర్వహిస్తున్న నలుగురిపై ఎస్‌వోటీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు, దివ్వెల మాధురి సమీ బంధవు పార్థసారథి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ దివ్వెల మాధురి బంధవు పార్థసారథికి మొయినాబాద్ పోలీసులు కోర్టు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
కాగా, ఈనెల 12న ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి బర్త్‌డే పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, దవ్వెల మాధురి కూడా హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌వోటీ టీమ్ ఫామ్‌హౌస్‌పై రెయిడ్ చేసింది. పార్టీకి ఎలాంటి అనుమతి లేకపోవడంతో 7 విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కాను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. బర్త్‌డే పార్టీకి 29 మంది హాజరయ్యారు. పార్థసారథితో పాటు ఫామ్‌హౌస్ యజమాని సుభాష్, వాచ్‌మెన్ షేక్, హుక్కా తీసుకొచ్చిన రియాజ్‌పై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.






