- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి.. 350 న్యూడ్ వీడియోలు రికార్డ్
మహారాష్ట్రలో 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన మహ్మద్ అయాజ్ అరెస్ట్! 350 వీడియోలతో బ్లాక్ మెయిల్.. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా మోజులో పడి అపరిచితులతో స్నేహం చేస్తున్న మైనర్ అమ్మాయిలకు ఈ వార్త ఒక హెచ్చరిక. వాట్సాప్, స్నాప్‌చాట్ వేదికలుగా వందలాది మంది అమ్మాయిలను ట్రాప్ చేసి, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసిన మహమ్మద్ అయాజ్ అనే కామాంధుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు తెలిశాయి.
ప్రేమ పేరుతో అమ్మాయిలను లోబర్చుకుని, వారిని ముంబై, పుణే నగరాలకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించడమే కాకుండా.. సుమారు 350 న్యూడ్ వీడియోలను చిత్రీకరించాడు. ఆ వీడియోలతో బెదిరిస్తూ కొందరిని వ్యభిచారంలోకి కూడా దింపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బీజేపీ ఎంపీ అనిల్ బోండేకు అందిన ఒక వినతిపత్రం ఆధారంగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






