గంజాయి డాన్ నీతూ భాయ్‌ అనుచరుడు మోబిన్ అరెస్ట్.. రూ.26 లక్షల సరుకు సీజ్

by Kema Shiva Kumar |

హైదరాబాద్‌లో గంజాయి డాన్ నీతూ భాయ్ అనుచరుడు మోబిన్‌ను మాదాపూర్ NOT, గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి డాన్ నీతూ భాయ్‌ అనుచరుడు మోబిన్ అరెస్ట్.. రూ.26 లక్షల సరుకు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో డ్రగ్స్, గంజాయ అక్రమ రవాణాపై పోలీసులు, ఈగల్ టామ్ (Eagle Team) ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే గంజాయి నెట్‌వర్క్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గంజాయి డాన్ నీతూ భాయ్ (Neetu Bhai) ముఠాపై పోలీసులు పంజా విసిరారు. ఈ మేరకు నీతూ భాయ్ ప్రధాన అనుచరుడు మోబిన్‌ (Mobin)ను పోలీసులు ఇవాళ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు భారీగా గంజాయి రవాణా అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో మాదాపూర్ నార్కోటిక్స్ ఆపరేషన్స్ టీమ్ (NOT), గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అనంతరం అనుమానాస్పదంగా రవాణా అవుతున్న 26 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.26 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గంజాయి డాన్ కోసం స్పెషల్ ఫోర్సెస్ వేట..

గంజాయి ముఠా ఒడిశా బార్డర్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా నగరంలోని పలు ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గంజాయి డాన్ నీతూ భాయ్ ప్రస్తుతం పోలీసుల నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను (Special Teams) రంగంలోకి దించి, అతడి అనుచరుడు మోబీన్‌‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.

Next Story