కరెంటు వైర్లు తగిలి పాడి గేదెల మృతి

by Taduka Kalyani |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

కరెంటు వైర్లు తగిలి పాడి గేదెల మృతి
X

దిశ, టేకుమట్ల (మొగుళ్లపల్లి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏడు పాడి గేదెలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం, ఈరోజు ఉదయం మేత కోసం వెళ్లిన గేదెలు నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షం, ఈదురు గాలుల కారణంగా తెగిపడిన విద్యుత్ వైర్లను తాకడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన పశువుల విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదానికి బాధ్యులైన విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, పాడి గేదెలను కోల్పోయిన బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story