దారిదోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

by Bhanu |

దారిదోపిడికి పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు మియాపూర్ పోలీసులు.

దారిదోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : దారిదోపిడికి పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు మియాపూర్ పోలీసులు. ఇందుకు సంబంధించి మియాపూర్ డీఐ రమేష్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. హఫీజ్ పేట్ కు చెందిన ఖాసీం ఈనెల 7వ తేదీన తన పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో బీ బ్లాక్ సమీపంలోకి రాగానే అక్కడే కాపు కాస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సయ్యద్ షబ్బీర్, ఆఫ్రోజ్ అలీఖాన్, హస్సన్, హర్ఫత్ లు బాధితుడు ఖాసీమ్ ను అటకాయించి అతని బైక్ కీ లాక్కుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతనిపై దాడికి దిగారు.


అతని వద్ద ఉన్న రూ.400లను లాక్కున్నారు. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో భయపడిపోయిన బాధితుడు తన తమ్ముడు ఫోన్ పే ద్వారా డబ్బులు పంపుతాడని, తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. దీంతో నిందితులు ఖాసీం సోదరుడికి స్కానర్ పంపారు. బాధితుడి తమ్ముడు ముందు రూ.15 వేలు, తర్వాత రూ.2 వేలు స్కానర్ ద్వారా పంపాడు. మొత్తం రూ.17400 దోచుకున్న నిందితులు బాధితుడు ఖాసీంను వదిలేశారు.

అక్కడి నుండి బయటపడ్డ ఖాసీం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సయ్యద్ షబ్బీర్, ఆఫ్రోజ్ అలీఖాన్, హస్సన్, హర్ఫత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఐ రమేష్ నాయుడు తెలిపారు.


Next Story