- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మియాపూర్ దాడి కేసు: యువతి తల్లి శోభ మృతి
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తల్లి కూతురిపై దాడి కేసులో యువతి తల్లి బుధవారం మృతి చెందింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మియాపూర్ తల్లి కూతురిపై దాడి కేసులో యువతి తల్లి శోభ బుధవారం మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి తల్లి శోభ కన్నుమూసింది. కోఠి ఈ ఎన్ టీ ఆస్పత్రిలో నిందితుడు సందీప్‌కు ఆపరేషన్ పూర్తి కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం. సందీప్ దాడిలో గాయపడ్డ యువతి వైభవి చికిత్స పొందుతోంది. కాగా గుంటూరు జిల్లా నేపల్లెకు చెందిన సందీప్ నిన్న మియాపూర్‌లో యువతి ఇంటికి వెళ్లి తల్లి కూతుళ్లపై దాడి చేశాడు. అనంతరం తాను గొంతుకోసుకున్నాడు. ప్రేమ పేరిట సందీప్ యువతి వెంట మూడేళ్లుగా పడుతున్నాడు. తరచూ ఫోన్ చేయడంతో యువతి సందీప్ నంబర్‌ను బ్లాక్ చేసింది. వేధింపులు అధికమవడంతో ఏడాది క్రితం మియాపూర్‌కు యువతి కుటుంబం షిఫ్ట్ అయింది. యువతి ఇంటి అడ్రస్ తెలుసుకున్న సందీప్ ఆమెపై దాడి చేసేందుకు రేపల్లె నుంచి హైదరాబాద్ వచ్చాడు. యువతి ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న తల్లిపై ఎటాక్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read....
అప్పుడే పుట్టిన బిడ్డను రెండంతస్తుల భవనం పై నుంచి విసిరేసిన 15 ఏళ్ల బాలిక






