- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల చిన్నారితో వివాహిత మిస్సింగ్.. వారం రోజులుగా వీడని మిస్టరీ
తన మూడేళ్ల చిన్నారితో వివాహిత మిస్సింగ్ కావడం దేవీపట్నం ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది.

దిశ, దేవీపట్నం: తన మూడేళ్ల చిన్నారితో వివాహిత మిస్సింగ్ కావడం దేవీపట్నం ప్రాంతంలో కలకలం సృష్టిస్తోంది. ఉదయం చిన్నారితో బయటవెళ్లిన మహిళ వారం రోజులు కావొస్తున్న ఆచూకీ లేకపోవంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు విలేఖరులకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. ఇందుకూరు గ్రామానికి చెందిన మదనపురి శ్రావణి(26)తన మూడేళ్ల కుమార్తె సాయి పల్లవితో కలిసి ఈ నెల 8వ తేదీ ఉదయం ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం అయినా తల్లీకూతురు తిరికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
వెంటనే బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికి చూశారు. వారిద్దరు మిస్సింగ్ అయినప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో గాలిస్తూనే ఉన్నారు. అయినా వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం శ్రావణి తల్లి ముత్యాల పార్వతి దేవీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 23/2026 కింద మహిళ మరియు బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా వారి సమాచారం తెలిస్తే వెంటనే 9440900761, 9440900763 నంబర్లకు తెలియజేయాలని దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ కోరారు.






