భర్త చేతిలో మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య.. భార్యను ముక్కలు చేసి మిక్సర్ లో వేసి కిరాతకం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-12 03:46:10  IST  )

స్విట్జర్లాండ్ లో దారుణం చోటు చేసుకుంది. మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టియానా జోక్సిమోవిక్‌ను ఆమె భర్త కిరాతకంగా హత్య చేశాడు. 2024 ఫిబ్రవరిలో ఈ హత్య జరగ్గా పోలీసులు భర్త థామస్ యే ఈ దారుణానికి పాల్పడ్డాడని గుర్తించారు.

భర్త చేతిలో మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య.. భార్యను ముక్కలు చేసి మిక్సర్ లో వేసి కిరాతకం
X

దిశ, వెబ్ డెస్క్: స్విట్జర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టియానా జోక్సిమోవిక్‌ను ఆమె భర్త కిరాతకంగా హత్య చేశాడు. 2024 ఫిబ్రవరిలో ఈ హత్య జరగ్గా పోలీసులు భర్త థామస్ యే ఈ దారుణానికి పాల్పడ్డాడని గుర్తించారు. అంతే కాకుండా భార్య శవాన్ని మాయం చేసేందుకు భర్త కిరాతకంగా వ్యవహరించినట్టు విచారణలో తేలింది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన థామస్ ఆమె గర్భాశయాన్ని తొలగించి తరవాత పెరట్లోని రంపంతో ముక్కలు చేశాడు. అనంతరం మిక్సర్ లో వేసి ముద్దగా చేసి దానిని రసయానాల్లో వేసి కరిగించాడు.

నేరానికి ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణాన్ని తాను యూట్యూబ్ లో చూసి చేసినట్టు విచారణలో వెల్లడించాడు. అంతే కాకుండా నడుం జాయింట్లను విడదీసి, మెడ, వెన్నెముకను కోసేసి, తలను వేరు చేసి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. పోస్ట్ మార్టంలో భయానకమైన నిజాలు బయపడ్డాయని అధికారులు తెలిపారు. 2023లో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి క్రిస్టియానా జుట్టుకు సంబంధించిన అవశేషాలను లాండ్రీ రూమ్ లో ఆమె తండ్రి గుర్తించడంతో కేసు మలుపు తిరిగింది. భర్త థామస్ ను తమదైన స్టైల్ లో విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. కాగా క్రిస్టియానా 2007 మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ కావడంతో దేశంలో ఈ కేసు సంచలనంగా మారింది.

Next Story