అడవిలో రహస్యంగా కలుసుకున్న మైనర్లు.. బలవంతంగా పెళ్లి చేసిన గ్రామస్తులు.. అక్కడే బిగ్ ట్విస్ట్

by Sujitha Rachapalli |

యూపీలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఫతేపూర్ జిల్లా రాధానగర్ పీఎస్‌లోని భగవంత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విలేజ్‌కు చెందిన మైనర్ బాలికకు..

అడవిలో రహస్యంగా కలుసుకున్న మైనర్లు.. బలవంతంగా పెళ్లి చేసిన గ్రామస్తులు.. అక్కడే బిగ్ ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీలో వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఫతేపూర్ జిల్లా రాధానగర్ పీఎస్‌లోని భగవంత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విలేజ్‌కు చెందిన మైనర్ బాలికకు.. మెయిన్‌పూరి జిల్లాకు చెందిన మైనర్ బాలుడితో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. రహస్యంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను కలిసేందుకు గ్రామానికి వచ్చాడు. అడవిలో కలుసుకున్నారు. కానీ వీరిద్దరిని చూసిన కొందరు గ్రామస్తులు.. బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చి.. ఊరు బయట ఆలయంలో పెళ్లి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా.. పోలీసులు, చైల్డ్ లైన్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారులను కస్టడీలోకి తీసుకున్నారు. సీడబ్ల్యూసీ ఆదేశాల ప్రకారం.. అమ్మాయిని మహిళలు మరియు చిన్నారుల రక్షణ కేంద్రంలో .. అబ్బాయిని చైల్డ్‌లైన్ సెంటర్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్న పోలీసులు.. తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Next Story