బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని న్యూస్.. పంచాయితీ పెద్దల ముందే మైనర్ ఆత్మహత్య.. కానీ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-22 18:42:56  IST  )

రెండు వేరు వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని ఆశ పడ్డారు.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు.. కానీ పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదు..

బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని న్యూస్.. పంచాయితీ పెద్దల ముందే మైనర్ ఆత్మహత్య.. కానీ..
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు వేరు వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి. ఇద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామని ఆశ పడ్డారు.. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు.. కానీ పెద్దలు ఇందుకు ఒప్పుకోలేదు.. ఇదే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో.. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చనిపోయాడనే న్యూస్ స్ప్రెడ్ అయింది. దీంతో ఈ మరణవార్త భరించలేని ఆమె ఆత్మహత్య చేసుకుంది. అది కూడా ఆ ఊరి పెద్ద ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ అబ్బాయి బ్రతికే ఉన్నాడు.. సూసైడ్ అటెంప్ట్ కూడా చేయలేదు. కానీ ఎవరో కావాలనే చేసిన అబద్దపు ప్రచారం కారణంగా నిండు ప్రాణం పోయింది. యూపీలోని మీరట్ జిల్లా ఖారఖూడలో ఈ ఘటన జరగ్గా.. పదహారేళ్ల మైనర్ బాలిక అందరి కళ్ల ముందే ప్రాణం విడిచింది.

Next Story