దారుణం.. 14ఏళ్ల బాలికపై 200 మంది అత్యాచారం

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-14 12:30:00  IST  )

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 14ఏళ్ల బాలిక.. చదువులో వెనుకబడిపోయింది. ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఏమంటారోనని ఇంటి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో ఒక మహిళను కలవగా.. బాగా చూసుకుంటానని చెప్పి పాపను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చింది.

దారుణం.. 14ఏళ్ల బాలికపై 200 మంది అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 14ఏళ్ల బాలిక.. చదువులో వెనుకబడిపోయింది. ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఏమంటారోనని ఇంటి నుంచి పారిపోయింది. ఈ క్రమంలో ఒక మహిళను కలవగా.. బాగా చూసుకుంటానని చెప్పి పాపను అక్రమంగా ఇండియాకు తీసుకొచ్చింది. దుర్భరమైన పరిస్థితుల్లోకి నెట్టేసింది. చిన్నారిని ముందుగా గుజరాత్‌కు తీసుకురాగా.. అక్కడ ఓ బ్రోతల్ హౌజ్‌కు అమ్మేయబడింది. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు తరలించారు. ఆమెకు హార్మోనల్ ఇంజక్షన్స్ ఇచ్చిన అక్కడి హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా.. పెద్దమ్మాయిలా కనిపించేలా చేశారు. పాపను ఒక బొమ్మలా వాడుకున్నారు. మూడు నెలల్లో దాదాపు 200 మంది ఆమెపై అత్యాచారం చేశారు.

జూలై 26న నైగావ్‌లో పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, కొన్ని ఎన్జీఓ సంస్థలు కలిసి చేసిన ఆపరేషన్‌లో ఈ అమ్మాయి దొరికింది. పాపను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. కాగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీస్ కమిషనర్ నికేత్ కౌశిక్. చిన్నారుల భద్రత గురించి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరింత విచారణ చేస్తామని తెలిపారు.

Also Read..

అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

Next Story