- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌పై అత్యాచారం
by Ajay Maddhiboyina |
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికకు దగ్గరైన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఎన్డీఆర్ జిల్లా కంచికచర్లలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికకు దగ్గరైన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఎన్డీఆర్ జిల్లా కంచికచర్లలో చోటు చేసుకుంది. ఇందిరా కాలనీకి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనివాస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన 17ఏళ్ల బాలికపై ఈ దారుణానికి పాల్పడ్డాడు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్టు డాక్టర్లు నిర్దారించారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో తల్లిదండ్రులు సైతం పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Next Story






