ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం.. ప్రేమ పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్

by Bhanu |   (  Updated:2025-07-22 16:21:57  IST  )

ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం.. ప్రేమ పేరుతో మైనర్ బాలిక కిడ్నాప్
X

దిశ, జగిత్యాల రూరల్: ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రూరల్ సీఐ దామెర సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన నవీద్ ఖాన్ బీర్పూర్ మండలం కు చెందిన మైనర్ బాలికతో ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బాలికకు పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఈ నెల 20వ తేదీన కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకెళ్లాడు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న బీర్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేసి బాలికను రెస్క్యూ చేశారు. నిందితున్ని జగిత్యాల కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ సీఐ దామెర సుధాకర్ మాట్లాడుతూ అమాయక మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేస్తే పట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేరెంట్స్ సైతం పిల్లలు స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వినియోగం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

Next Story