నిర్భయ నగరం మళ్ళీ వణికింది: బాలికపై ముగ్గురు మృగాళ్ల సామూహిక అత్యాచారం!

by Gantepaka Srikanth |

దేశ రాజధానిలో మహిళల రక్షణపై ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదు.

నిర్భయ నగరం మళ్ళీ వణికింది: బాలికపై ముగ్గురు మృగాళ్ల సామూహిక అత్యాచారం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో మహిళల రక్షణపై ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని నిఘా నేత్రాలు ఉన్నా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా ఢిల్లీలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలోని గోదాంలో మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం, బాధితురాలు (ఏడేళ్ల బాలిక) తన ఇంటి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ముగ్గురు యువకులు ఆమెను బలవంతంగా ఒక కారులోకి ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి సమీపంలోని ఒక పాత గోదాంలోకి తీసుకెళ్లి, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఘటన జరిగిన అనంతరం నిందితులు బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు అతికష్టంమ్మీద ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు వివరించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు POCSO (పోక్సో) చట్టం మరియు ఐపీసీ సెక్షన్ 376D కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో ముగ్గురు నిందితులను పోలీసులు గాలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాజకీయ నేతలు, మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని, రాజధానిలో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story