- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీసరలో దారుణం: మైనర్ బాలికపై బంధువుల సామూహిక అత్యాచారం
మైనర్ బాలికను కంటికి రెప్పలా కాపాడాల్సిన బందువులే.. సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కీసరలో చోటు చేసుకుంది.

దిశ, కీసర: ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన కీసర పోలీస్ స్టేషన్ (Keesara Police Station) పరిధిలో కలకలం రేపింది. అమ్మాయిపై సొంత ఇద్దరు అన్నలు, మేన మామ లైంగిక దాడి (sexual assault)కి పాల్పడిన ఘటన కీసర పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.చిన్నారి తండ్రికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు ఇద్దరు కుమారులు చిన్న భార్యకు ఒక్కతే కూతురు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై లైంగిక దాడి చేశారు.ఈది చూసిన మేన మామ పిల్లల్ని మందలించాల్సింది పోయే తనుకూడా చిన్నారిపై లైంగిక దాడి చేశాడు.ఈ విషయంపై గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న చిన్నారి పక్కన ఉన్న వారికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం చీకటి మామిడి లోని ప్రభుత్వ హాస్టల్‌లో 6వ తరగతి చదువుతుంది.
ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు మహారాష్ట్రలో ఉన్నట్లు కీసర సీఐ అనంజనేయులు తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.అనంతరం బాధిత చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి,చట్టపరమైన అన్ని చర్యలు చేపట్టారు. నిమ్మబోలియ అడ్డలోని జోనల్ హోంలో చిన్నారిని చేర్పించారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అనంజనేయులు తెలిపారు.చిన్నారులపై జరిగే లైంగిక నేరాల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండదని ఆయన స్పష్టం చేశారు.






