మైనర్ బాలికను హత్యాచారం చేసిన నిందితుడు అరెస్టు

by Bhanu |

గ్రామ శివారులో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు.

మైనర్ బాలికను హత్యాచారం చేసిన నిందితుడు అరెస్టు
X

దిశ, గీసుగొండ: గ్రామ శివారులో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐ ఎ. మహేందర్ వివరాలు వెల్లడించారు. గత నెల 28న అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో కొమ్ముల లిటిల్ (21) అనే యువకుడు ఓ 16 ఏళ్ల బాలికను బలవంతంగా తన బైక్‌పై ఎక్కించుకొని గ్రామ శివారులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. తాజాగా శుక్రవారం లిటిల్ తన ఇంటి వద్ద ఉన్నాడన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి మోటార్ బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


Next Story