మాట ఇచ్చాడు.. మోసం చేశాడు.! మైనర్‌పై లైంగిక దాడి.. 20 ఏళ్ల శిక్ష

by Bhanu |   (  Updated:2025-06-25 15:30:33  IST  )

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 15 వేల జరిమానాను విధించింది.

మాట ఇచ్చాడు.. మోసం చేశాడు.!  మైనర్‌పై లైంగిక దాడి.. 20 ఏళ్ల శిక్ష
X

దిశ, సిటీక్రైం : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు బుధవారం ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 15 వేల జరిమానాను విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ మెకానిక్ గా పని చేస్తున్నాడు. అతనికి పరిచయమైన ఓ మైనర్ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన సొంత గ్రామానికి తీసుకుపోయి, అక్కడ రెండు రోజులు పెట్టుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత యువతిని తన ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో వారు డబ్బీర్ పుర పోలీసు స్టేషన్ లో కేసును 2020 జూలై లో నమోదు చేశారు. అప్పటి ఏసీపీ ఎన్. సత్యనారాయణ పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసులో పూర్తి ఆధారాలు సేకరించి కోర్టులో చార్జీషీటును దాఖలు చేశారు. బాధితురాలికి భరోసా కేంద్రం అధికారులు పూర్తిగా అండగా నిలబడ్డారు. ఈ సంఘటనతో ఒత్తిడిలో యువతిని తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకువచ్చి ఆమె ధైర్యం నింపారు.

నిందితుడు వంశీకృష్ణ కుటుంబం యువతి కుటుంబం పై రాజీకి ఒత్తిడి తీసుకువచ్చినా పోలీసులు యువతికి అండగా నిలబడ్డారు. కోర్టు విచారణలో వంశీకృష్ణ నేరానికి సంబంధించిన ఆన్ని ఆధారాలను పోలీసులు రుజువు చేయడంతో న్యాయమూర్తి నిందితుడు వంశీకృష్ణకు 20 ఏళ్ల జైలు, 15 వేల జరిమానాను విధిస్తూ బుధవారం తీర్పును వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు సిబ్బంది, అధికారులను సీపీ అభినందించారు.

Next Story