ఆర్టీసీ బస్సు ఢీకొని వలస కూలీ మృతి

by velandi.Saikiran |

మండలంలోని కేశనపల్లి మూలమలుపు వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీకొని వలస కూలీ మృతి
X

దిశ, ముత్తారం: మండలంలోని కేశనపల్లి మూలమలుపు వద్ద శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీ తిరుపతిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో కేశనపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story