- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడలో అర్ధరాత్రి అమానుషం.. కానిస్టేబుల్ గొంతు కోసి చంపిన దుండగులు
అర్ధరాత్రి దుండగులు కానిస్టేబుల్ గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఘటన కాకినాడ పట్టణంలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కాకినాడ (Kakinada) పట్టణంలో అదివారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గాంధీ నగర్ (Gandhi Nagar) ప్రాంతంలో విధులకు వెళ్తున్న ఓ ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్‌ను దుండగులు అడ్డగించి గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశారు. అయితే, మృతుడిని నాగేశ్వరరావు (Nageswara Rao)గా గుర్తించారు. ఆయన ఏపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో ఆయన గాంధీ నగర్ గుండా నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. పదునైన కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై నాగేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్య పాత కక్షల వల్ల జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పట్టపగలు, జనం తిరిగే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.






