నాతో కాపురం చేస్తావా కాటికి పంపాలా..ఏపీలో వివాహితపై దారుణం

by Ajay Maddhiboyina |

ఏపీలోని భీమ‌వ‌రంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి సూర్య నాగ‌మ‌ణి అనే వివాహిత‌పై పొలిశెట్టి హేమంత్ అనే వ్య‌క్తి బ్లేడుతో దాడి చేశాడు.

నాతో కాపురం చేస్తావా కాటికి పంపాలా..ఏపీలో వివాహితపై దారుణం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలోని భీమ‌వ‌రంలో దారుణం చోటు చేసుకుంది. మామిడి సూర్య నాగ‌మ‌ణి అనే వివాహిత‌పై పొలిశెట్టి హేమంత్ అనే వ్య‌క్తి బ్లేడుతో దాడి చేశాడు. తీవ్ర‌గాయాలు కావ‌డంతో నాగ‌మ‌ణి త‌న త‌ల్లి పండ్ల దుకాణం వ‌ద్ద‌కు ప‌రుగులు తీసింది. దీంతో స్థానికులు హుటాహుటిన ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. నాగమ‌ణికి గ‌తంలోనే వివాహం కాగా కుటుంబ క‌ల‌హాల‌తో భ‌ర్త నుండి దూరంగా ఉంటుంది. ఇప్ప‌టికే నాగ‌మణి విడాకుల‌కు అప్లై చేసుకుంది. కాగా గ‌త కొన్ని రోజుల నుండి హేమంత్ నాగ‌మ‌ణిని లైంగికంగా వేధిస్తున్న‌ట్టు తెలుస్తుంది. నా భార్య‌కు విడాకులు ఇచ్చి నీతోనే కాపురం చేస్తా అంటూ హేమంత్ నాగ‌మ‌ణిని వేధిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో మ‌ధ్యాహ్నం నాగ‌మ‌ణి ఇంటికి వెళ్లిన నింధితుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంత‌రం ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. హేమంత్ కోసం గాలింపు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.

Next Story