- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. వృద్ధురాలి మెడలోంచి 1.5 తులాల చైన్ చోరీ..
by Bhanu |
మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలి మెడలోంచి 1.5 తులాల బంగారు గొలుసు దొంగతనం జరిగిన సంఘటన కలకలం రేపింది.

X
దిశ, కార్వాన్ : మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలి మెడలోంచి 1.5 తులాల బంగారు గొలుసు దొంగతనం జరిగిన సంఘటన కలకలం రేపింది. ఇన్స్పెక్టర్ మల్లేశం అందించిన వివరాల ప్రకారం, విజయనగర్ కాలనీకి చెందిన చంద్రకళ (70) పాల ప్యాకెట్ తీసుకుని తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించాడు. వృద్ధురాలు నడుస్తూ ఉండగా, ఆ దుండగుడు ఆమెకు పక్కన చేరి బలవంతంగా గొలుసును లాకెళ్ళి పారిపోయాడు.
చంద్రకళ ప్రతిఘటించినప్పటికీ దొంగను అడ్డుకోలేకపోయింది. దొంగ గుర్తించకుండా ఉండేందుకు హెల్మెట్ ధరించినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. చంద్రకళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






