- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను హత్య చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసులో ట్విస్ట్.. ఆ ఎఫైర్ వల్లే!
భార్యను హత్య చేసి ఆపై ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భార్యను హత్య చేసి ఆపై ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మీర్‌పేట్‌లో ఈ దారుణం జరగ్గా ఇప్పటి వరకు 11నెలలు పూర్తైంది. కాగా 11నెలల తరవాత కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. నిందితుడు గురుమూర్తికి మరదలితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో భార్యతో పలుమార్లు గొడవలు జరిగినట్టు తెలిసింది. అనేకసార్లు పంచాయితీలు పెట్టినా గురుమార్తి తీరు మారలేదు.
భార్యను హతమార్తి మరదలితో ఉండేందుకే గురుమూర్తి ఈ ఏడాది భార్యను పథకం ప్రకారం హతమార్చాడు. అసలు ఆధారాలే దొరకకుండా శరీర భాగాలను కోసివేసి కుక్కర్ లో ఉండకబెట్టి, పొడి చేసి చెరువులో కలిపేశాడు. అప్పట్లో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. గదిలో మృతురాలికి సంబంధించిన చిన్న చిన్న ఆనవాళ్లు లభించడంతో డీఎన్ఏ టెస్టు ద్వారా పోలీసులు కేసును చేదించారు. ఇక పదకొండు నెలల తరవాత గురుమూర్తి నోరువిప్పి మరదలితో ఎఫైర్ కారణంగానే భార్యను హతమార్చినట్టు ఒప్పుకున్నాడు.





