ఏటీఎంలో Romance.. సెక్యూరిటీకి ఆ స్థితిలో చిక్కిన వైద్య విద్యార్థులు

by Disha Web Desk |
ఏటీఎంలో Romance.. సెక్యూరిటీకి ఆ స్థితిలో చిక్కిన వైద్య విద్యార్థులు
X

దిశ, వెబ్‌డెస్క్ : లవర్స్‌కు అతి పెద్ద సమస్య ఏకాంతంగా గడిపేందుకు ప్లేస్‌లు లేకపోవడం. పార్కులకు వెళ్లినా.. అక్కడ డిస్ట్రబ్‌గా ఉంటుంది. అలా లాడ్జీలకు వెళ్తే పోలీసుల భయం. దీంతో వారికి ప్రైవసీ దొరకడం కష్టంగా మారుతుందట. అయితే ఓ జంట మాత్రం వీటన్నీకి భిన్నంగా రొమాన్స్ చేసింది. బయట సెక్యూరిటీ గార్డును పెట్టి లోపల ఏకాంతంగా గడిపింది. పబ్లిక్ ప్లేస్.. చుట్టూ జనం.. సీసీ కెమెరాల నిఘాలో ఉన్నమన్న ధ్యాస కూడా లేకుండా అసభ్యకంగా రొమాన్స్ చేసింది. బిహార్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

పాట్నాలోని కంకర్ బాగ్ ప్రాంతం శాలిమార్ మోర్‌లో సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా ఏటీఎం ఉంది. దానిలో సీసీ కెమెరాలతోపాటు బయట సెక్యూరిటీ గార్డు కూడా 24/7 గంటలు కాపలాగా ఉంటారు. అయితే ఆ ఏటీఎంకు యువతీయువకుడు వెళ్లారు. సెక్యూరిటీ గార్డే డోర్ తీసి వాళ్లను లోపలికి పంపాడు. అర గంట దాటినా వాళ్లు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన గార్డు లోపలికి వెళ్లి చూశాడు. అక్కడి జరుగున్న దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాడు. ఏటీఎంలో ఆ యువతీ యువకుడు అసభ్యకంగా రొమాన్స్ చేస్తూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము మెడికోలని, చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపారు. ఏకంతంగా గడిపేందుకే అలా చేశామని ఒప్పుకున్నారు. వారి సర్టిఫికెటన్లు పరిశీలించిన పోలీసులు.. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని హెచ్చరించి పంపించారు.

Next Story