Medaram Jatara 2026 : జంపన్న వాగులో పడి భక్తుడు మృతి

by Bhoopathi Nagaiah |

జంపన్న వాగులో పడి భక్తుడు మృతి చెందిన ఘటన మేడారం జాతరలో చోటు చేసుకుంది.

Medaram Jatara 2026 : జంపన్న వాగులో పడి భక్తుడు మృతి
X

దిశ, మేడారం నెట్వర్క్: జంపన్న వాగులో పడి భక్తుడు మృతి చెందిన ఘటన మేడారం జాతరలో చోటు చేసుకుంది. విశ్వసనీయ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బీమారానికి చెందిన కొమ్ము శ్రీనివాస్ (54) కుటుంబంతో సహా బుధవారం మేడారానికి చేరుకున్నారు. జంపన్న వాగులో స్నానం అనంతరం తల్లుల ఆశీర్వాదం తీసుకుందామని ఆశించిన శ్రీనివాస్ మృత్యువాత పడ్డారు. వరదలో కొట్టుకుపోవడంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. జాతర మొదటి రోజే దుర్ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా... జంపన్న వాగులో వరద ప్రవాహం పెరగడం, అడుగు భాగాన గల ఇసుక లోతులు అక్కడక్కడా హెచ్చు తగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు వాగులో ఉన్న లోతు హెచ్చు తగ్గులు సరి చేయలేదని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

Next Story