- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
by Bhanu |
మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి అరెస్టు చేశారు.

X
దిశ, చైతన్యపురి : మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు, ఎల్బీనగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి అరెస్టు చేశారు. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ ఆనంద్ నగర్ కాలనీలో నివసించే మహమ్మద్ ఖాసిముద్దీన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు.
ఈక్రమంలో బెంగళూరుకు చెందిన సౌరాయ్ సంతోష్ వద్ద నుండి 17 గ్రాముల ఎండిఎంఏ మత్తు పదార్థాలను కొనుగోలు చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం సమీపంలోని ప్రభుత్వ పెట్రోల్ బంకు వద్ద సోమవారం అరెస్టు చేశారు. సౌరాయ్ సంతోష్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story






