మొబైల్ పక్కన పెట్టి చదువుకోమన్న బంధువు.. ఎంబీఏ స్టూడెంట్ ఆత్మహత్య

by Sujitha Rachapalli |

సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక ఉచిత సలహా ఇస్తూనే ఉంటారు. ఈ ఉచిత సలహానే ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. వెస్ట్ ఢిల్లీ సాగర్‌పూర్‌లోని ఐఐడీమ్‌లో

మొబైల్ పక్కన పెట్టి చదువుకోమన్న బంధువు..  ఎంబీఏ స్టూడెంట్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక ఉచిత సలహా ఇస్తూనే ఉంటారు. ఈ ఉచిత సలహానే ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. వెస్ట్ ఢిల్లీ సాగర్‌పూర్‌లోని ఐఐడీమ్‌లో ఎంబీఏ చదువుతున్నాడు 20 ఏళ్ల యువకుడు. అయితే ఓ బంధువు ఇంటికి వచ్చినప్పుడు అతను చేతిలో మొబైల్ ఫోన్‌తో కనిపించగా.. ఫోన్ పక్కన పెట్టి చదువుపై కాన్సంట్రేట్ చేయమని సూచించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనివల్ల అప్ సెట్ అయిన యువకుడు ఇంట్లోని తన గదిలో ఉరేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆశీర్వాద్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. తర్వాత మృతదేహాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్, ఆ తర్వాత సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

Next Story