HYD: పంజాగుట్ట బంగారం దుకాణంలో భారీ చోరీ

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-16 11:14:01  IST  )

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో భారీ దొంగతనం జరిగింది. జాయ్ అలుకాస్ నగల దుకాణంలో అందులో పనిచేసే ఉద్యోగి భారీ చోరీ చేశాడు.

HYD: పంజాగుట్ట బంగారం దుకాణంలో భారీ చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో భారీ దొంగతనం(Massive Theft) జరిగింది. జాయ్ అలుకాస్(Joyalukkas) నగల దుకాణంలో అందులో పనిచేసే ఉద్యోగి భారీ చోరీ చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా రోజూ కొన్ని ఆభరణాలను మాయం చేశాడు. ఇలా ఏకంగా రూ. కోటి విలువజేసే నగలు ఎత్తుకెళ్లాడు. ఆభరణాలు మిస్ అవడాన్ని గమనించిన యాజమాన్యం.. సీసీటీవీలు చెక్ చేయగా.. అసలు నిజం బయటపడింది. ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఉద్యోగిని గుర్తించి.. కేసు పెట్టారు. తాజాగా సదరు ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి చోరీ సమయంలో ఎవరైనా సాయం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవల ఇలాంటి ఘటన బనగానపల్లిలో కూడా జరిగిన విషయం తెలిసిందే. పట్టణంలోని శ్రీ శ్రీనివాస బంగారు దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న 18 తులాల బంగారం, 5 కిలోల వెండిని గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.40 లక్షల వరకు ఉంటుందని బాధితులు వాపోయారు. దుకాణానికి వేసిన తాళాన్ని గ్యాస్‌ వెల్డింగ్‌తో తీసి లోనికి ప్రవేశించారు. దుకాణం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టేసుకున్నారు.

Next Story