- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాను మించిన సీన్.. రాష్ట్రంలో భారీ దారి దోపిడీ
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దారి దోపిడీ జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్/శంకర్ పల్లి: రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా శంకర్‌పల్లి(Shankarpally) పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దారి దోపిడీ(Massive Robbery) కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఘట్కేసర్‌కు చెందిన రాకేశ్ అనే స్టీల్ వ్యాపారి నుంచి కొందరు గుర్తు తెలియని దుండగులు రూ.40 లక్షల నగదు లాక్కునున్నారు. వికారాబాద్ నుంచి డబ్బులు తీసుకొస్తున్న క్రమంలో పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి డబ్బులు చోరీ చేశారు. వ్యాపారి కారును వెంబడించి.. కారును ఢీకొట్టి.. వ్యాపారి కళ్లలో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి డబ్బుల బ్యాగుతో ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. బాధితుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






