రాష్ట్రంలో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-14 02:41:07  IST  )

భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ (Gudiwada)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

రాష్ట్రంలో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ (Gudiwada)లో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెహ్రూ చౌక్ సెంటర్‌ (Nehru Chowk Center))లోని అద్దేపల్లి కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కాంప్లెక్స్‌లోని ఓ సెల్‌ఫోన్ షాపుతో పాటు మూడు క్లాత్ స్టోర్లలో మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే, ప్రమాదం జరిగిన కాంప్లెక్స్‌లో జూనియర్ కళాశాల, ఎస్‌బీఐ బ్యాంక్ కూడా ఉండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఓ మొబైల్ స్టోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story