Metro Station: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Metro Station: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం మలక్‌పేట్ మెట్రో స్టేషన్(Malakpet Metro Station) వద్ద మంటలు చెలరేగాయి. మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న వాహనాలను ఈ మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ వ్యాపించింది. మెట్రో ప్రయాణికులతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే ఐదు బైకులు(Bikes) పూర్తిగా దగ్ధం అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story