పాకిస్తాన్‌ క్వెట్టాలో భారీ పేలుడు.. 10 మంది మృతి

by Malleboina Mahesh |   (  Updated:2025-09-30 10:59:55  IST  )

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది.

పాకిస్తాన్‌ క్వెట్టాలో భారీ పేలుడు.. 10 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ మరోసారి సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రావిన్స్‌లోని క్వెట్టాలో మంగళవారం మధ్యాహ్నం జర్ఘున్ రోడ్‌లోని FC (ఫ్రాంటియర్ కాన్స్టాబులరీ) ప్రధాన కార్యాలయం ముందు ఎవరూ ఊహించని స్థాయిలో బాంబు పేలింది (bomb exploded). ఈ పేలుడు ధాటికి 10 మంది ప్రాణాలు కోల్పోగా.. 32 మంది గాయపడ్డారు. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో మోడల్ టౌన్, పరిసర ప్రాంతాల వరకు శబ్ధం వినిపించింది. అలాగే పేలుడు ధాటికి సమీపంలోని ఇల్లు, భవనాల కిటికీలు పగిలిపోయాయని పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఆ వెంటనే, ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు తెలుస్తుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని పాకిస్తాన్‌కు చెందిన అధికారులు తెలిపారు. కాగా ఈ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రద్దీగా ఉన్న రహదారిపై ఒక్కసారిగా భారీ పేలుడు జరగడం స్పష్టంగా కనిపించింది.

బాంబ్ బ్లాస్ట్ వీడియో

Next Story