- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉరేసుకొని మేస్త్రి బలవన్మరణం..
by Batti.Sumithra |
చెట్టుకు ఉరేసుకొని మేస్త్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, చందానగర్ : చెట్టుకు ఉరేసుకొని మేస్త్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూహఫీజ్ పేట మార్తాండనగర్ కు చెందిన వినోద్ (19) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి దీప్తి శ్రీనగర్ ప్రాంతంలోని నిర్జన ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా మృతుడు కనిపించడంలేదని మూడు రోజుల కిందట మియాపూర్ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలంలో ఖాళీమద్యం బాటిళ్లు పడి ఉండడంతో వినోద్ మృతి పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






