- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో షాకింగ్ ఘటన... పెళ్లైన 50 రోజులకే కుటుంబ సభ్యులకు మత్తు మందు ఇచ్చి!
ఇటీవల బీహార్‌లో పెళ్లైన వారం రోజులకే భర్తను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బీహార్‌లో పెళ్లైన వారం రోజులకే భర్తను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కాగా తాజాగా యూపీలో పెళ్లైన 50 రోజులకే యువతి ప్రియుడితో జంప్ అయ్యింది. యూపీలోని సావరా గ్రామంలో నివసించే సల్మాన్‌కు ఏప్రిల్ 25న లోని ప్రాంతానికి చెందిన సనాతో వివాహం జరిగింది. కాగా మే 13న రాత్రి సనా కుటుంబ సభ్యులకు లస్సీ ఇచ్చింది. ఆ లస్సీలో మత్తు మందు కలపడంతో తాగిన వాళ్లు అంతా నిద్రలోకి జారుకున్నారు.
ఉదయం 7 గంటల వరకు ఆ ఇంట్లో ఎవరూ లేవకపోవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి నిద్రలేపారు. ఇంట్లో సనా కనిపించకపోవడంతో అంతా షాక్ అయ్యారు. బీరువాలో చూడగా లక్షలు విలువచేసే నగదు, రూ.44వేల రూపాయలు కూడా మాయం అయ్యాయి. దీంతో వెంటనే సల్మాన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా సీసీ టీవీ కెమెరాలో సనా ఓ యువకుడితో బైక్‌పై వెళ్లినట్టు రికార్డ్ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె కోసం గాలించగా యువకుడితో కలిసి దొరికిపోయింది. భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.






